ప్రగతి.. సంక్షేమం.. టీడీపీ లక్ష్యం
1 min read– టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహఖ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కడప : బడుగుబలహీన వర్గాల రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్య నిర్వహఖ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేక్ కట్ కార్యకర్తలకు తినిపించారు గోవర్ధన్ రెడ్డి. అనంతరం గోవర్దన్ రెడ్డితోపాటు ఉపాధి హామీ మాజీ కౌన్సిల్ సభ్యులు పీరయ్య మాట్లాడుతూ టీడీపీ 40 వ ఏట అడుగు పెట్టిందని. ఈ అలుపెరగని రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను దాటుకుని ముందుకు సాగుతోందన్నారు. చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారని. అలా ప్రారంభమైన ప్రస్థానం ఇంకా కొనసాగుతోందన్నారు. అనంతరం దివంగత నేత, మాజీ సీఎం నందమూరి తారకరామారావు విగ్రహానికి క్షిరాభిషేకం చేసి గజమాల వేసి నివాళులర్పించారు. ఆ 40 కేజీల కేక్ కట్ చేసి శ్రేణులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు జిలాని బాషా, రాష్ట్ర శాప్ మాజీ డైరెక్టర్ దూద్ద్యాల జయచంద్ర,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గన్నేపాటి మల్లేష్, అధికార ప్రతినిధి ఆమూరి బలదాసు,ఫ్యూచర్ టెక్ ఆసీఫ్, ఏలీయా,మీనాక్షి,నిర్మల,స్వర్ణ లత,విజయ కుమారి, శశి వర్ధన్,రామాంజనేయులు,డాక్టర్ జగన్మోహన్ రెడ్డి,రమణ,జియా ఉద్దీన్,జింకా శ్రీను,రవి శంకర్ రెడ్డి,నాయుడు,మధు,ద్వారక,గుఱ్ఱప్ప,మహిళ నాయకురాలు మీనాక్షి, స్వర్ణలత, అభిమాన్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళ్ళు అర్పించారు.