PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ప్రాంతాల్లో సిగ‌రెట్ల అమ్మకం పై నిషేధం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీలో నిర్దేశిత ప్రాంతాల్లో సిగ‌రెట్లు, పొగాకు ఉత్పత్తుల అమ్మకం పై నిషేధం విధించ‌నున్నారు. విద్యా సంస్థల ప్రహరీ నుంచి 100 గ‌జాల లోపు ఎక్కడా సిగ‌రెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేర‌కు పాఠ‌శాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిప‌ళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2007-2008 నుంచి పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని అమ‌లు చేస్తోంది. ఇందులో మొత్తం 21 ప్రభుత్వ శాఖ‌లు భాగం కావాల్సి ఉంది. పాఠ‌శాల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులు విక్రయించే వారికి జ‌రిమానా విధించే అధికారం ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు ప్రిన్సిప‌ళ్లు, హెడ్మాస్టర్లకు కూడ ఉంటుంది. 20 రూపాయ‌ల నుంచి 200 రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు. విద్యాసంస్థ ప్రాంగ‌ణాల్లో పొగాకు ర‌హిత ప్రాంతం అని బోర్డులు కూడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

About Author