అనుమతులు పొందిన ప్రచార సాధనలనే ఉపయోగించాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 137 కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మునిసిపల్ కమిషనర్ శ్రీ ఏ భార్గవ్ తేజ ఐ.ఏ.ఎస్, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియామవాలి అమలులో ఉందన్నారు. నగరంలోని రాజకీయ నాయకుల విగ్రహాలను కప్పి వేశామని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు తొలగించామని వివరించారు. అనుమతి లేని పోస్టర్లు బ్యానెర్లు మొదలగు ప్రచార సాధనాలను తొలగించడం జరుగుతుంది అని, అన్ని రాజకీయ పార్టీలు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఖఛ్చితంగా అనుమతులు పొందిన ప్రచార సాధనలనే ఉపయోగించాలని తెలిపారు.