PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలి

1 min read

– వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏల స్థానంలో వారి వారసులను నియమించాలి
– ముఖ ఆధారిత హాజరు మినహాయింపు ఇవ్వాలి
– వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యరాజు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల/ కోవెలకుంట్ల : రాష్ట్రంలోనే రెవెన్యూ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) సేవలను ప్రభుత్వం గుర్తించి వెంటనే వారికి వీఆర్వో( విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) గా పదోన్నతి కల్పించాలని ఏపీ వీఆర్ఏ సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్య రాజు కోరారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ మండలాల వీఆర్ఏలతో కోవెలకుంట్ల తాహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సంఘం జిల్లా నంద్యాల అధ్యక్షులు కే. ఎస్. నారాయణ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యరాజు మాట్లాడుతూ వీఆర్ఏలకు విఆర్ఓ ప్రమోషన్లు తో పాటు టీఏ, డీ ఏ ల రికవరీ రద్దు చేయాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్ఏలకు టీఏడీఏలతో కూడిన వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. .ఏపీ ఎఫ్ ఆర్ ఎస్ ముఖ ఆధారిత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా కొత్త జిల్లా కొత్త డివిజన్లో అటెండర్, వాచ్మెన్, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ విఆర్ఎల చేత భర్తీ చేయాలన్నారు. వృద్ధాప్యంలో ఉన్న విఆర్ఎల స్థానంలో వారి వారసులను నియమించాలని కోరుతున్నాము అన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు కేఎస్ నారాయణ మాట్లాడుతూ వీఆర్ఏలు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా జిల్లాలోని మండలాల్లో వీఆర్ఏల సమస్యలు ఏమైనా ఉన్నయెడల తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించునకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుబ్రమణ్యం, వీఆర్ఏ సంఘము డివిజన్ నాయకులు కోవెలకుంట్ల శివరం, సంజామల నాయుడు, గోస్పాడు నాగరాజు, ఉయ్యాలవాడ అల్లా బకాష్, కొలిమిగుండ్ల సంజీవ, బనగానపల్లె సుబ్రహ్మణ్యం, ఆయా మండలాల వీఆర్ఏలు పాల్గొనడం జరిగింది.

About Author