PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాతృత్వానికి నిదర్శనం.. ‘రెడ్ క్రాస్’

1 min read
మాట్లాడుతున్న ఎస్పీ ఆర్​. వెంకటేశ్వర్లు

మాట్లాడుతున్న ఎస్పీ ఆర్​. వెంకటేశ్వర్లు

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​ :ఆపదలో ఉన్న వారిని ఆదరిస్తూ… తగిన చేయూతనందిస్తూ…దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న రెడ్ క్రాస్ సేవలు అద్భుతం..ఆమోఘమని జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవాలను పురస్కరించుకుని శనివారం మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జాన్ హేన్రి డ్యూనాట్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి ప్రసంగించారు. మొదట కేవలం 5 దేశాలకే పరిమితమై రెడ్ క్రాస్ సేవలు.. కాల క్రమేణా నేడు 190 దేశాలకు విస్తరించడం అభినందనీయమనన్నారు. ప్రపంచ యుద్ద సమయాల్లో రెడ్ క్రాస్ సంస్థ పోషించిన పాత్ర గొప్పదని అన్నారు. ఆపదలో ఉన్న వారికి కేవలం రక్తాన్ని సమకూర్చడ మే కాకుండా అనేక రకాలుగా సేవలందిస్తున్న మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు శాఖ పక్షాన రెడ్ క్రాస్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా విరివిగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.
విజేతలకు మెడల్స్​..: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన , వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికేట్ లను, మెడల్స్ ను ప్రదానం చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట రాజు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు బెక్కం జనార్దన్, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డా:శామ్యూల్, కోశాధికారి సురభి జగపతిరావు, సభ్యులు రమణయ్య, వీరేశం, వైద్యాధికారి డా:రజిత, జూనియర్,యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్తలు అశ్విని చంద్రశేఖర్, బాల లింగయ్య, బాబుల్ రెడ్డి,ప్రొఫెసర్ లక్ష్మయ్య, మేనేజర్ గాంధీ, జిల్లా పోలీస్ శాఖ పీఆర్ ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.



About Author