PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్తి, నీటి పన్ను చెల్లించాల్సిందే..

1 min read

– లేదంటే నీటి సరఫరా కట్​
పల్లెవెలుగు వెబ్​, కడప: ఆస్తి, నీటి పన్ను బకాయిలు ఉన్న వారు వెంటనే చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మున్సిపల్​ కమిషనర్​ లవన్న హెచ్చరించారు. పాత బకాయిలు వసూలు చేయడంలో భాగంగా శనివారం స్పెషల్​ బృందం ఇంటింటికి తిరిగి ఆస్తి, నీటి పన్ను వసూలు చేస్తున్నారన్నారు. చెల్లించని వారి ఇంటికి నీటి కనెక్షన్​ తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కమిషనర్​ రమణారెడ్డి, డిప్యూటీ మేయర్​, రెవెన్యూ అధికారులు, ఇన్​స్పెక్టర్లు, ఇంజనీరింగ్​ విభాగపు డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

About Author