విద్యార్థులకు చదివే ఆస్తి… : చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ :రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తూ.. పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్నదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ లు పేర్కొన్నారు.శుక్రవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కలెక్టరేట్ విసి హాల్ నందు కలెక్టర్ గిరీష పి.ఎస్.. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి… శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జఖియ ఖానం లచేతులమీదుగా అన్నమయ్య జిల్లాల్లోని విద్యార్థులకు 39,36,52,500 రూపాయల మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు నంద్యాలలో జగనన్న వసతి దీవెన రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా అన్నమయ్య జిల్లాలో 40,465 మంది విద్యార్థులకు 36,536 మంది తల్లుల ఖాతాలలో39,36,52,500 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం వసతి దీవెన, నాడు నేడు తదితర కార్యక్రమాల ద్వారా విద్యా రంగానికి దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతోందన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో విద్యభివృద్ధికి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులకు చదువు ఉంటే ఎక్కడైనా రాణించగలరని విద్యార్థులకు చదువు ఒక ఆస్తి లాంటిదన్నారు. జీవితంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ బాగాచదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్నదే సీఎం జగన్ ఆశయమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. విద్య ఎంతో విలువైందని చదువు తరగని ఆస్తి లాంటిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో విద్యార్థులకు టెస్ట్ బుక్స్ ,యూనిఫామ్, బెల్టు వంటివి ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందజేయడం జరుగుతోందన్నారు. గతంలో దివంగత నేత డాక్టర్ వైయస్. రాజశేఖర్రెడ్డి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి గా గుర్తింపు పొందారన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి.. తండ్రి ఏదైతే ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. విద్యా దీవెన,వసతి దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన 34 నెలల కాలంలో 10,500 కోట్ల రూపాయిలని ఇప్పటిదాకా ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని కేవలం ఇంటర్ డిగ్రీ తోనే చదువు ఆపకుండా ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉద్యోగాలు పొందాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయ ఖానం మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువులకు అధిక నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. వసతి దీవెన ద్వారా అర్హులకు ఈ పథకం వర్తించకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఇంటర్ నుంచి పై చదువులు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ వో బాపిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, ఏవో బాలకృష్ణ, డి ఎస్ డబ్ల్యు ఓ గురు ప్రసాద్, ఏ ఎస్ డబ్ల్యు ఓ రఘురామయ్య, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.