NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన ఉత్సవ విగ్రహముల సంప్రోక్షణ

1 min read

– కర్నూలు పాతనగరం వన్ టవున్,పేట మెయిన్ బజార్
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: ” ఏకాంత రామాలయం ” లో రాబోయే చైత్రశుద్ధ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యే 98 వ సప్త రాత్రోత్సవ బ్రహ్మోత్సవాల దృష్ట్యా కుంభకోణం లోని ప్రముఖ కంపెనీ వారి వద్ద తంత్రసార ఆగమ శాస్త్ర పద్ధతిలో భక్తుల విరాళాలతో తయారు చేయించిన పంచలోహ సీత,రాము,లక్ష్మణ నూతన విగ్రహాలను తెచ్చి కర్నూలు ప్రముఖ పురోహితులు శ్రీ ఉత్తరాది మఠం పండితులైన పగడాల వేణుగోపాలాచార్యుల ఋత్వికత్వం లో నిన్న గణపతి పూజ , పుణ్యాహవాచనం , కలశ స్థాపనము , మూలమంత్ర జపము , వేద పారాయణము, స్వస్తివాచనము , మహా మంగళహారతి , నైవేద్యము భక్తులకు ప్రసాద వితరణ జరిగినది. ఈరోజు ఉదయం గంగా,నర్మదా,కృష్ణ, తుంగభధ్ర,తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి స్వామి పుష్కరిణి, తిరుపతి లోని కపిల తీర్థం,కావేరి,తదితర నదుల నుండి తెచ్చిన పవిత్ర జలాలను 120 కలశాల్లో నింపి ఆవాహన చేసి కళాకర్షణ,షోఢషోపచార పూజ అనంతరం పవిత్ర జలాలతో అభిషేకం , మరియూ అష్టదిక్పాలక,నవగ్రహ,సీత,రామ,లక్ష్మణుల ఆవాహనా హోమం,పూర్ణాహుతి నిర్వహించారని అనంతరం హాజరైన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ,భోజనం కార్యక్రమం నిర్వహించ బడినదని ఆలయ కార్యనిర్వణాధికారి పి. దినేష్ తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మాళిగి రామ్మూర్తి ఆచార్య, అర్చకులు మాళిగి హనుమేషాచార్, మాళిగి జయతీర్థ, మాళిగి ఆనందతీర్థ (అనంతపూర్), విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,ముంజేతి ప్రసాద్,మధు, రాజేంద్ర ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

About Author