కర్నూల్లో ప్రజల ఆరోగ్యాలు కాపాడే నాధుడే లేడు…
1 min readకర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
అందుకే తానే స్వయంగా హైపో ద్రావణం పంపిణీ చేయాలని నిర్ణయించా.. టి.జి భరత్
దోమలపై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విపరీతమైన దోమల ద్వారా కర్నూలు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం నగరంలోని 11వ వార్డులో స్థానిక నాయకులు ఏర్పాటుచేసిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు ఆల్ అవుట్‌లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఎటు చూసినా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని చెప్పారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. శానిటేషన్ పనులు చేసి, దోమలను తరిమికొట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. తమ ఫ్యాక్టరీ నుండి హైపో ద్రావణం ఉచితంగా ఇస్తామని చెప్పినా మున్సిపల్ అధికారులు తీసుకునేందుకు స్పందించలేదని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు స్పందించలేదని అర్థమవుతుందన్నారు. కర్నూల్లోని నాయకులు ప్రజలకు మంచి చేయరని.. చేసే వాళ్లను ప్రోత్సహించరని చెప్పారు. అందుకే తానే స్వయంగా ఆదివారం నుండి మౌర్య ఇన్‌లో ప్రజలకు ఉచితంగా హైపో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. జొహరాపురంలో ఇటీవల 14 ఏళ్ల బాలుడు జ్వరంతో చనిపోయారని చెప్పారు. అందుకే ప్రజలందరూ ఎన్నికల సమయంలో ఎవరు మంచి వారో గ్రహించి ఓటు వేయాలన్నారు. లేదంటే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. కర్నూల్లో 700 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారని.. అది ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఏ వీధికి వెళ్లినా ప్రజలు సమస్యలే చెబుతున్నారని చెప్పారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పథకాల వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మెహబూబ్ ఖాన్, ఈశ్వర్, సలీం, మున్ని, ఫర్జానా, సభా, అనంతయ్య, పెంచలయ్య, చిన్నమ్మ , ఖాజా, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.