సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి ఇలా కాపాడుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్: సెల్ ఫోన్ నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రేడియేషన్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఉదాహరణకు మనం షర్ట్ ముందు జేబులో లేదా ప్యాంట్ పాకెట్లోనో.. ఇలా సెల్‌ఫోన్ శరీరానికి దగ్గరగా కాకుండా, కనీసం ఒక అంగుళం దూరం ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం జేబులో ఉంచుకునే సెల్‌ఫోన్‌కూ శరీరానికి మధ్య వాలెట్ లేదా పాకెట్ బుక్ ఉంచుకోవచ్చు. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మొబైల్‌ను రెండు అంగుళాలు దూరంగా ఉంచడం ద్వారా రేడియేషన్‌ను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీలైనంతవరకూ స్పీకర్ లేదా ఇయర్ ఫోన్స్ వాడుకోవాలి. ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు, రింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ రేడియేషన్ వెలువడుతుంది. కాబట్టి అవతలి వాళ్లు కాల్ లిఫ్ట్ చేసేవరకూ స్పీకర్ ఫోన్ మోడ్ వాడాలి.