PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం అందరి బాధ్యత

1 min read

– ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రజా సంఘాలపై ప్రతిపక్షాలపై, నేటి యువతపై అన్ని వ్యవస్థలపై ఉందని   ప్రభుత్వ  ఆస్తుల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి  వక్తలు పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్ స్థానిక ప్రెస్  క్లబ్ లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ  ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎగిసి మెంబర్ కొలను కొండ శివాజీ  మాట్లాడుతూ మేకిన్ ఇండియా అంటు వంద భారత్ రైళ్ళు,ఉక్కు మనిషి సర్థార్ వల్లభాయ్ పటేల్  విగ్రహం  అంటు చైనాలొతయారు చేస్తారని అన్నారు .భవొద్వేగాలాను రెచ్చగోడుతు అధికారం చేపట్టారన్నారని అన్నారు.  అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అవసరం నేటియువతపైఉందనన్నారు. సబ్ కె సాత్ సబ్ కా వికాస్ పేరుతో దేశాన్ని  హోల్సేల్ గా ఆదానీలకు అంబానీలకు అమ్మి వేస్తున్నారని అన్నారు ఒకనాడు ఒక గుజరాతీయుడు కోసం పోరాడితే  నేటి గుజరాతీయుడు దేశాన్ని  కార్పొరేట్ శక్తుల కోసం పని చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం సభ్యులు నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి ఆనాటి బ్రిటిష్ వాళ్ళ కన్నా ఇప్పుడున్న బిజెపి పార్టీ దాన్ని నడిపిస్తున్న క్రోని క్యాపిటలిస్ట్  గౌతమ్ఆధాని ప్రమాదకరమని  అన్నారు. నేడు దేశంలో క్రోని క్యాపిటలిజం నడుస్తుందని అన్నారు.  అనంతరం ఎడిటర్ ఎడిటర్ వాయిస్ సంపాదకులు రమణ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని వాటిని రూపుమాపేందుకు  అన్ని రకాల వస్తువులు అన్ని వర్గాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వమే   కీలక రంగాల్లో  ప్రవేశించి  దేశంలో  ఉపాధి  కల్పనకే  ప్రభుత్వ రంగ సంస్థలలను ఏర్పాటు చేసిందని అన్నారు. దీంతో  ఆర్థిక అసమానతలు తొలగడంతోపాటు  దేశ పురోగతిసాధిస్తుందననే ఆలోచనలతో  మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. వాటిలో విశాఖ ఉక్కు, బీహెచ్ఈఎల్, రైల్వే రంగాలు బిఎస్ఎన్ఎల్ వంటివి ఏర్పాటు చేశారని అన్నారు.  అనంతరం ప్రముఖ పాత్రికేయులు  డేని మాట్లాడుతూ   ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులని  ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయటం  1991లో మొదలైందని ఇప్పుడు వేగం  పుంజుకుందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేకపోవడం వల్ల రిజర్వేషన్ కూడా లేకుండా పోతుందని దానితో ఆర్థిక  అసమనతలకు దారి  తీస్తుందని అన్నారు. భారతదేశంలో కార్పొరేట్ రౌడీయిజం సాగుతుందని అన్నారు.  జిఎంఆర్ నుంచి ఎయిర్పోర్ట్లు నౌకాశ్రమలు ఆదాని సంస్థలు లాక్కున్నారని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ విద్య వైద్య రంగాల్లో నుంచి ప్రభుత్వం దాదాపు తప్పుకుందని అన్నారు. మణిపూర్ లో  అల్లర్లు సృష్టించేది మణిపూర్ లోని ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకేనని  ఎరుక కలిగి ఉండాలని అన్నారు. అనంతరం ప్రముఖ జర్నలిస్ట్ నగేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇటువంటి జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు జర్నలిస్టులు వృత్తి జర్నలిస్టులుగా కాకుండా  ప్రజలకు ఉపయోగపడే జర్నలిస్టులుగా ఉండాలని అన్నారు. దేశ సంపదను  ఆదాని అంబానీ లకు అప్పచెప్పే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని అన్నారు . ఈ కార్యక్రమంలో ఏవీవీ శ్రీనివాసరావు,58వడివిజన్ సిపిఐ  నాయకులు భాస్కర్ రావు, పిచ్చుక శ్రీనివాస్ న్యాయవాది, కిరణ్, గంగరాజు డెల్టా న్యూస్, నాగపూర్, వార్త ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author