PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్ష

1 min read

– గడప వద్దకే వైద్యం వైసీపీ ప్రభుత్వ ద్వేయం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  జగనన్న ఆరోగ్య సురక్ష  ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని ఎంఎల్ఏ తొగురు ఆర్థర్ అన్నారు.గురువారం  నందికొట్కూరు మండలం లోని దామగట్ల గ్రామంలో నిర్వహించిన  జగనన్న ఆరోగ్య సురక్ష  ప్రారంభం కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గడప వద్దకే వైద్యంను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఐదు అంచెల్లో జరిగే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష  కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, పిల్లలు, యువత  ఇలా ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి వాటిని కచ్చితంగా పరిష్కరించేలా జగనన్న ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో జరిగే సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్‌ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదన్నారు.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా  3,255 వ్యాధులకు ఉచిత వైద్యం అందుతోందని,చికిత్స , శస్త్ర చికిత్సల తదనంతరం రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో దినసరి భత్యం కు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా  ద్వారా రూ. 225 ను అందిస్తోందన్నారు. నాడునేడు కింద  అన్ని ప్రభుత్వ ఆస్పత్రులనుఅభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నాలుగేళ్ల పాలనలో కేవలం వైద్యానికి రూ.3,600 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు.  జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు.  ప్రతి ఇంటికీ వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యం, మందులు అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అన్నారు. అలాగే అధికారులతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ  జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మనం ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పధకాల ద్వారా ఆర్థిక సాయం  చేసినా కూడా ఆరోగ్యం విషయాల్లో చిన్న కుటుంబాలు మెరుగైన వైద్యం చేయించుకోలేక పోతున్నాయని, అలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమని తెలిపారు. చాలా మందికి ఏ ఆరోగ్య సమస్యకు ఎవరి వద్దకు వెళ్ళాలో తెలియదు. అలాంటి వారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయం ప్రభుత్వం నుంచి అందేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఖచ్చితంగా మనమంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ కూడా మరింత ఉపయోగపడేలా ఉంటుందని, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్షగా ఉండబోతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  మాధవరం సుశీలమ్మ , ఎంపీడీఓ శోభారాణి, తహశీల్దార్ రాజశేఖర్ బాబు, సీడీపీఓ కోటేశ్వరమ్మ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ శుకూర్ , బ్రాహ్మణకొట్కూరు సొసైటీ మాజీ అధ్యక్షులు  మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , నందికొట్కూర్ మండల వైసీపీ నాయకులు  ఉండపల్లి ధర్మారెడ్డి , పాములపాడు మండల నాయకులు శ్రీముడియాల వెంకటరమణారెడ్డి ,  వేల్పుల జ్యోతి ,  మాధవరం రత్నం , సంజన్న, తిమ్మాపురం నాగన్న , వైద్యులు వైద్య సిబ్బంది  వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author