తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
1 min read– ఐ. ఏ. ఎల్. డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: న్యాయవాదుల రక్షణ చట్టంను తక్షణమే అమలు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్సులు ఎన్. కృష్ణయ్య,బి. రంగస్వామి, సీనియర్ న్యాయవాది ఏ. సత్యనారాయణ, ఐ. ఏ. ఎల్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ లు డిమాండ్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ( IAL ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు జిల్లా పత్తికొండలో స్థానిక బార్ అసోసియేషన్ మరియు స్థానిక I. A. L .కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక న్యాయస్థానం కాంపౌండ్ ఆవరణంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం న్యాయవాదు లను ఉద్దేశించి స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్సులు ఎన్. కృష్ణయ్య, బి. రంగ స్వామి, సీనియర్ న్యాయవాది ఏ. సత్యనారాయణ, ఐ. ఏ. ఎల్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని న్యాయవాదులకు రక్షణ చట్టం లేని కారణంగా దేశవ్యాప్తంగా నిత్యం న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్లు చేసి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాలు దాటిన న్యాయవాదులు దేశవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారికి వెల్ఫేర్ ఫండ్ అవకాశం లేకుండా పోయిందని వారందరికీ అవకాశం కల్పించాలని కోరారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు చాలాకాలంగా డెత్ బెనిఫిట్స్ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.మృతి చెందిన న్యాయవాదులకు 10 లక్షల నుండి 12 లక్షలకు బీమా పెంచాలని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి లా నేస్తం పథకాన్ని ప్రతినెల అమలు చేయాలని, దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నందువలన కక్ష దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి న్యాయవాదికి ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి 75 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు ఉండడానికి సరైనటువంటి వసతి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, నూతన వసతి గృహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు H. k.లక్మన్న,ఎం. మల్లి కార్జున, బి. రమేష్ బాబు, డి. బాల బాషా, సుధ కృష్ణ,రవి ప్రకాష్, జతంగి రాజు,మధు బాబు, బి టి. నాగలక్ష్మయ్య,పంప పాతి, డి. వెంకటేశ్వర్లు,కె. నరసింహులు, కబీర్ దాస్, వీరేశ్, ఎల్. నెట్టే కల్లు, పి.వాసు దేవా నాయుడు తదితరులు పాల్గొన్నారు.