PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా హక్కుల పరిరక్షణే ద్యేయంగా పోరాటం..

1 min read

– మహిళా సమైక్య 15వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్రంలో మహిళలపై  జరుగుతున్న అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా మహిళా హక్కుల పరిరక్షణే దేయంగా మహిళా సమైక్య పోరాటం కొనసాగిస్తుందన్నారు. అందుకు నవంబర్ 17,18,19 తేదీలలో నంద్యాల వేదిక గా జరుగు రాష్ట్ర మహాసభల్లో ఉద్యమ భవిష్యత్ కార్యచరణ దిశగా మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సుగుణమ్మ పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక జైకిసాన్ పార్కులో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తాలూకా జనరల్ బాడీ సమావేశం రజితమ్మ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమనకు ముఖ్య అతిథులుగా ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. సుగుణమ్మ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.రఘురాంమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా స్వేచ్ఛ సమానత్వం కోసం మహిళల స్థితిగతుల్లో మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గత ఎన్నో సంవత్సరాలనుండి పోరాడుతున్నదని మన రాష్ట్రంలో అనేక పోరాటాలకు మహిళా సమైక్య నాయకత్వం వహించిందన్నారు. మహిళల ఆరోగ్యం,బాలికల విద్య, బాలవివాహల్ని వితంతు పునర్విహాలను ప్రోత్సహిస్తూ గ్రామ గ్రామాన మహిళా సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పరిష్కార కోసం ఉద్యమాన్ని విస్తృత పరుస్తున్న సంఘం మహిళా సమైక్యాన్ని వారన్నారు.అలాంటి ఘన చరిత్ర కలిగిన రాష్ట్ర మహాసభలు నంద్యాల వేదికగా జరుగుతున్నాయని ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాసులు మౌలాలి.ఏఐఎస్ ఎఫ్  రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు,జిల్లా నాయకులు మహానంది, వినోద్, దినేష్.ఏపీ జీఎస్ పోచయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తాలూకా నూతన కమిటీ ఎన్నిక.

ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య తాలూకా అధ్యక్షులుగా దానమ్మ, ఉపాధ్యక్షులు గా ఈశ్వరమ్మ, మరియమ్మ, పోలమ్మ, మౌలాబీ,ప్రధాన కార్యదర్శిగా రజితమ్మ, సహాయ కార్యదర్శులు గా లక్ష్మిదేవి, శ్రావణి, రానెమ్మ, లక్ష్మిదేవి, కోశాధికారి గా సుశీలమ్మ, కమిటీ సభ్యులు గా దేవాయని, అయేషా, బావమ్మ, పుష్పవతి, మైబున్, అనురాధ, కౌసల్య లను ఎన్నుకున్నారు.

About Author