వేసవి తాపం నుండి ట్రాఫిక్ పోలీస్ కి రక్షణ కవచాలు..
1 min readటోపీ,కళ్ళజోడు,వాటర్ బాటిల్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ అందజేత..
వారి సేవలు అభినందనీయం
ఏలూరు రేంజ్ డీఐజీ జీవిజి అశోక్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వేసవి తాపం నుండి ఏలూరు జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి అశోక్ కుమార్ ఐపీఎస్ ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఎండ తీవ్రతను రక్షణ పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను అందజేసిన ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ జి వి జి అశోక్ కుమార్ ఐపియస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వేసవి తాపం నుండి ట్రాఫిక్ సిబ్బంది రక్షణ పొందేందుకు వారికి డిఐజి గారు సమ్మర్ వెల్ఫేర్ కిట్లను ఏలూరు రేంజ్ కార్యాలయంలో అందచేసినారు. ఈ సమ్మర్ కిట్ లో ఎండ తీవ్రత నుండి కాపాడే సమ్మర్ హ్యాట్స్, సన్/కూలింగ్ గ్లాసెస్, చల్లదనం ఉంచే వాటర్ బాటిళ్లు, ORSL ప్యాకెట్లు, అలాగే రాత్రి సమయాల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి ప్రమాదాలు జరక్కుండా లైటింగ్ బ్యాటన్ మరియు రేడియం రిఫ్లెక్టింగ్ సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి. ఈ సందర్భముగా డిఐజి మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది నిత్యం మండుటెండలో విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందని, తీవ్రమైన ఎండల్లో దుమ్ము, ధూళి లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే వారికి వేసవి తాపం నుండి స్వీయ రక్షణ చాలా అవసరమని, ఎండకు డీహైడ్రేషన్ కాకుండా నీరు బాగా తాగాలని, వడ దెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులకు లోను కాకుండా ORSL, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు సేవించాలని మరియు వేసవి కాలంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని, వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకి మెరుగైన సేవలందించాలని, విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.పోలీస్ సిబ్బంది సంక్షేమంలో ఎంతో శ్రద్ద తీసుకుంటూ వేసవిలో నాణ్యమైన సమ్మర్ కిట్ ను అందించిన డీఐజీ జి.వి.జి అశోక్ కుమార్ ఐపీఎస్ కి మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ కి జిల్లా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కృతజ్ఞతలను తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ ఎన్ సూర్య చంద్రరావు, ఏ.అర్ అదనపు ఎస్పీ శేఖర్ గారు ఏ.అర్ డిఎస్పీ కృష్ణంరాజు గారు, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ పి. చంద్ర శేఖర్ ,ఏలూరు 3 ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ ,ఏలూరు 1 టౌన్ ఎస్ఐ రామకృష్ణ ,ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ బుద్దల శ్రీనివాస రావు , శ్రీదర్ వేంకటేశ్వర రావు, నూజివీడు ట్రాఫిక్ ఎస్ఐ రాధ కృష్ణ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.