వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువు…
1 min read– భరత్ కుమార్, టిడిపి బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కడప : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీసీలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు . నిన్న అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో కురబ సామాజిక వర్గానికి సంబంధించిన TDP సానుభూతిపరుడు నాగార్జున అనే వ్యక్తిని YCP గుండాలు అతి కిరాతకంగా హత్య చేసి చంపడం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రి-సర్వేలో భాగంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ కార్యకర్త యొక్క అనుభవంలోని స్థలం నాగార్జున కుటుంబ సభ్యులదిగా తేలినది. అందులో భాగంగా వారి భూమి వద్దకు వెళ్లిన సందర్భంలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళని చంపాలని కుట్రచేసిన వైసిపి గుండాలు కాపు కాచి నాగార్జున మీద అతని కుటుంబ సభ్యుల మీద వేటకొడవల్లతో తీవ్రంగా దాడి చేశారని ఈ దాడిలో నాగార్జున మరణించగా ఆయన చిన్నాన్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ధ్వజమెత్తారు.దాదాపు ఇప్పటివరకు 72 మందికి పైగా బీసీలను వైసిపి ప్రభుత్వంలో హతమార్చారని, వందల సంఖ్యలో దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారని అయినా వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తున్న వారికి అండగా నిలబడుతున్నదని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.ఇలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసమే తెలుగుదేశం పార్టీ *బీసీలకు రక్షణ చట్టం* రాబోయే కాలంలో తీసుకు వస్తున్నదని, ఈ YCP ప్రభుత్వానికి బీసీలందరూ కలిసికట్టుగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ సెల్ కడప పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డయ్య యాదవ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.