వర్ఫ్ సవరణ బిల్లు కు వ్యతిరేకంగా ధర్నా
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలం లో ముస్లిం ల తరుపున వర్ఫ్ సవరణ బిల్లు కు వ్యతిరేకంగా హొళ గుంద బస్టాండ్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్, అబ్దుల్ హామీద్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన వక్స్ సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టింది. కావున ప్రతి ఒక్కరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.వెంటనే వక్స్ బిల్ ను ఆపకపోతే, బిల్ కు మద్దతు ఇచ్చిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్యులర్ ముసుగులో అధికారం లోకి వచ్చి ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేసింది. అన్నారు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే రానున్న రోజుల్లో ఒక్క ముస్లిం ఓటు కూడా ఎన్డీఏ కు పడకుండా నిరంతరం కృషి చేస్తుందని సైఫుల్ల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు ” రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు ను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు తదితరులు పాల్గొన్నారు.