NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

16వ సంఖ్యా నమూనాలో నిరసన…

1 min read

16వ సంఖ్య ఆకారంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అంగన్వాడీలు..

పల్లెవెలుగు వెబ్  చాగలమర్రి :  నిరవధిక సమ్మె చేపట్టి 16 రోజులు గడుస్తున్న  పట్టించుకోని ప్రభుత్వంపై నిరసనగా అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, 16వ సంఖ్య రూపంలో  నడిరోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ( ఏఐటీయూసి) చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉప సంఘంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారన్నారు.  చర్చలు విఫలం కావడంతో సమ్మె యదా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చిందన్నారు. ఉద్యమ కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేల నివాసాల ముట్టడి, తదుపరి వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఏ ఐ టి యు సి  చాగలమరి మండల నాయకురాలు వహీదా,హసీనా, సుజాత, ఇందుమతి, హసానమ్మ, రహమత్, జ్యోతి, గుర్రమ్మ మేరీ,ఉమాదేవి,నాగమ్మ, వెంకటసుబ్బమ్మ, గౌరీ ఈశ్వరమ్మ, పద్మావతి,గుత్తి సుజాత,  మాబుచాన్, సుమతి, రహిమూన్, వివిధ గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు.

About Author