ఏప్రిల్ 2 న కలెక్టరేట్ ముందు నిరసన – ఫ్యాప్టో
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ఏప్రిల్ 2 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దానిని విజయవంతం చేయుట కొరకు నేటి ఉదయం 11గంటలకు ఎస్ టి యు భవన్ యందు రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకుల సమావేశం జరిగింది.ఈ సమావేశం నకు ఫ్యాప్టో రాష్ట్ర కో ఛైర్మన్ కె ప్రకాష్ రావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జి హృదయ రాజు గారు హాజరు కావడం జరిగింది. సమావేశం కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ సేవలాల్ నాయక్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఛైర్మన్ కాకి ప్రకాష్ రావు గారు మాటలాడుతూ కరోనా కాలం నుండి మరణించిన ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల పిల్లలకు ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు చేపట్టాలని ఫ్యాప్టో డిమాండ్ చేస్తుందని అందుకు గాను కారుణ్య నియామకాలు కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా నిరసన కార్యక్రమం లో పాల్గొనవలెనని, పి అర్ సి కమిటీ వేసి, ఐ అర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యుడు జి హృదయ రాజు మాట్లాడుతూ డి ఎ బకాయిలు చాల ఉన్నాయి, వాటిని వెంటనే ప్రకటించాలని, సరెండర్ లీవ్ బకాయిలు 2022 నుండి పెండింగ్ లో వున్నాయి. కొన్ని బకాయిలు ఈ నెలలో చెల్లించిన చాల వరకు పెండింగ్ లో ఉన్నాయి వాటిని చెల్లించటానికి రోడ్ మ్యాప్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ సేవలాల్ నాయక్ మాట్లాడుతూ ఫ్యాప్టో నిరసన కార్యక్రమం కొరకు జిల్లాలోని నలుమూల ల నుంచి ఉపాధ్యాయ మరియు ఉద్యోగులు హాజరు కావాలని కోరటం జరిగింది.ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ మాట్లాడుతూ ఫ్యాప్టో నిర్ణయించిన కార్యక్రమం విజయవంతం చేసీ ప్రభుత్వం నకు ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కోరిక ను తెలియచెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.ఈ సమావేశం యందుజిల్లా ఫ్యాప్టో ఆర్ధిక కార్యదర్శి రంగన్న (ఎ పి టి ఎఫ్ 257),రవి కుమార్ (యు టి ఎఫ్), నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), గోకారి (ఎస్ టి యు), జనార్ధన్ (ఎస్ టి యు), శ్రీనివాస్ రెడ్డి (ఎ పి టి ఎఫ్ 1938), వెంకట రాముడు(డి టి ఎఫ్), నందీశ్వరుడు(బి టి ఎ) సమావేశం లో పాల్గొనడం జరిగింది.