AP జాతీయ విద్యా విధానం పై 14న నిరసన
1 min read–FAPTO రాష్ట్ర కార్యదర్శి కె ప్రకాష్ రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఏపీ కొత్త విద్యా విధానం (NEP) అమలు విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. అన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించినా ముందుకు వెళుతోందని , ఏపిజె ఏసి రాష్ట్ర సెక్రెటరీ జెనెరల్ జి హృదయ రాజు, FAPTO రాష్ట్ర కార్యదర్శి కె ప్రకాష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఫ్యాప్టో నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా FAPTO రాష్ట్ర కార్యదర్శి కె ప్రకాష్ రావు మాట్లాడుతూ కొత్త విద్యా విధానంపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో 44 సంఘాలకు గాను 42 సంఘాలు వ్యతిరేకించాయని ఫ్యాప్టో గుర్తు చేసిందని, చివరకు శాసనమండలిలో తమ సభ్యుల ద్వారా వ్యతిరేకత తెలియజేసినా ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కితీసుకోకపోవడం సరికాదన్నారు.
గత్యంతరంలేక ప్రజాస్వామబద్దంగా తమ గొంతు వినిపించేందుకు ఆందోళన బాట పట్టాల్సి వస్తోందన్నారు. 14న రాష్టంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలకు ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. సమావేశంలో FAPTO కర్నూలు జిల్లా సెక్రటరీ జెనెరల్ రంగన్న, ఆనంద్ BTA రాష్ట్ర కార్యదర్శి, ఓంకార్ యాదవ్ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘము అధ్యక్షుడు, నారాయణ జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం కార్యదర్శి ,మధు సుధన్ రెడ్డి అప్టా జిల్లా అధ్యక్షుడు, సేవ నాయక్ అప్టా జిల్లా కార్యదర్శి,నాగేశ్వరరావు STU, బజారప్ప DTF, రాంగోపాల్, నరేంద్ర APTF, వీరా రెడ్డి UTF మరియు FAPTO సభ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.