పరీక్షా ఫలితాల పై నిరసన.. రైలుకు నిప్పు !
1 min readపల్లెవెలుగువెబ్ : రైల్వే పరీక్ష ఫలితాల పై బీహార్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్టెక్నికల్ పాపులర్ సీబీటీ-1 పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఆతర్వాత ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు.