రహదారి మరమ్మతులు చేపట్టాలని నిరసన
1 min read– నంద్యాల నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి కోవెలకుంట్ల వెళ్ళే రహదారి
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల : స్థానిక నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి కోయిలకుంట్ల కి వెళ్లే రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు మంగళవారం రహదారిలో మోకాళ్ళ పైన నిల్చోని నిరసన తెలియజేసిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్,డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు ఓబులేసు, గోపాల్, సంజయ్ శాంతి వర్ధన్, నూర్, స్థానిక యువకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నిరంజన్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ దాదాపు సంవత్సరం కాలం పాటు నుండి నంద్యాలలోని నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ కోయిలకుంట్ల కు వెళ్లే రహదారి రైతు నగరం వరకు ప్రమాదకరమైన గుంతలు ఏర్పడిన వాటిని పునరుద్ధరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రతిరోజు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తదితర అధికారులు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న వారి కంటికి ఈ ప్రమాదకరమైన గుంతలు కనపడటం లేదు కనపడిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య, నేషనల్ హైవే అథారిటీ అధికారిని గారికి ఈ రహదారిని మరమ్మతులు చేయండి అని కోరితే మా దగ్గర నిధులు లేవని చెప్పడం సిగ్గుచేటు దాదాపు నంద్యాల బై ఎలక్షన్ల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో వేసిన రోడ్డును ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోని మరమ్మతులు చేయకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు. వెంటనే ఈ రహదారిని పునర్నిర్మించాలి నూనెపల్లి బ్రిడ్జి పైన కొత్తగా రోడ్డు వేయాలి ఈ రహదారి గుంతలతో నిండిపోవడం ద్వారా ప్రయాణికులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు గత నెల కిందట ఓ వ్యక్తి లారీ కింద పడి మృతి చెందడం అదేవిధంగా వర్షం కురిసినప్పుడు ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు ప్రమాదానికి గురైన కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి వెంటనే స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చూడదామని హెచ్చరించడం జరిగింది.