ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
1 min read
అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం
నిరసన కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విద్యారంగంలో చూస్తే పాఠశాల విద్యను విధ్వంసం చేసిన జిఓ నెంబర్ 117ను రద్దుచేయాలనే డిమాండ్ ఉపాధ్యాయుల నుండి ఉవ్వెత్తున వచ్చింది. ఆ జి.ఓ.ను రద్దు చేయుటకు నేటి ప్రభుత్వం అంగీకరించడం ముదావహం. అయితే జి.ఓ నెంబర్ 117 అమలుకు ముందు ఉన్న తెలుగు మీడియం/ మైనర్ మీడియం లను పునరుద్దరించుటకు ఈ ప్రభుత్వం అంగీకరించకపోవడం బాధాకరం. నూతన జాతీయ విద్యా విధానంలో సైతం స్థానిక భాషలో బోధన చేయాలని సూచించినా,తెలుగు భాష ఆత్మాభిమానం పునాదిగా ఏర్పడిన ప్రభుత్వం సైతం తెలుగు మీడియం రద్దుకు కంకణం కట్టుకోవడం ఆందోళనకరమైన విషయం.ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి విధి నిర్వహణలో నిమగ్నమై పనిచేయడానికి ఇన్ని ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయి. జీవిత చరమాంకంలో జీతంలో సగభాగమైపోయిన పెన్షన్ కుటుంబ అవసరాలకు సరిపోక మరోవైపు అధికమవుతున్న వైద్య ఖర్చులతో పెన్షనర్లు నూతన పి.ఆర్.సి మరియు డిఎల ప్రకటన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇన్ని ఇబ్బందుల మధ్య ఇటు ఉద్యోగ జీవితాన్ని అటు కుటుంబ పోషణను అధికమించలేక మా ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున సమస్యల సాధన కోసం కలెక్టర్ స్పందించి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య, ఎల్ సాయి శ్రీనివాస్ ( ఎస్ టీ యూ)సెక్రటరీ జనరల్ నరహరి (డిటీఎఫ్) కో-చైర్మన్ బి మనోజ్ (బిటీఏ) కో-చైర్మన్, చందోలు వెంకటేశ్వర్లు. ( ఎస్సి ఎస్టీ యూస్) కో-చైర్మన్ కె ప్రకాష్ రావు ( ఏపిపిటీఏ) డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుముర్తి (ఏపిటీఎఫ్257) డిప్యూటీ సెక్రటరీ జనరల్, వి శ్రీనివాసరావు (ఏపిహెచ్ఎమ్ఏ) డిప్యూటీ సెక్రటరీ జనరల్ చింతల సుబ్బారావు( ఎస్. ఏఎస్ఎస్ఓ) కోశాధికారి. ఎమ్ ఎస్ ఇమామ్ బాషా (ఆర్ యూ టీఏ) కార్యదర్శి.డి మధుసూదన్ రావు (ఏపిఆర్ఐటీఏ) కార్యదర్శి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
