ఉర్దూ ..కన్నడ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: జిల్లా ప్రజా పరిషత్ హొళగుంద హై స్కూల్ నందు ఈరోజు సీబీఎస్సీ సిలబస్ అఫీలియట్ వద్దని ఉర్దూ కన్నడ సంఘాల నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉన్నపలంగా ఉర్దూ కన్నడ మాధ్యమం చదువుతున్న విద్యార్థులను ఉన్నపలంగా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్లి చదవాలంటే విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు సంఘాల నాయకులు తెలిపారు పిల్లలకు కన్నడ ఉర్దూ మాధ్యమంలోనే చదువు చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు, ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్ కోరగా నా యొక్క పరిధిలో ఉన్నంతవరకు నేను చేయగలుగుతానని చెప్పారు ఇదివరకే కన్నడ ఉర్దూ సంఘాల నాయకులు ఈ విషయాన్ని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకి కర్నూలు నందు శ్యాంబుల్ సాల్, గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా ఈ సమస్య మీద చర్య తీసుకోలేదు ఈ పాఠశాల యందు దాదాపు 550 మంది పిల్లలు కన్నడ మరియు ఉర్దూ చదువుతున్నారు, ఈ విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది ఈ సమస్యను జటిలం కాకుండా స్పందించాలని రేపు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరపాలని నిశ్చయించాము, అయిన తర్వాత ఈ సమస్యపై జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రతిరోజు ఆందోళన చేపడతామని అన్నారు, ఉర్దూ కన్నడ సంఘాల నాయకులు శివ శంకర గౌడ్ ,గవి సిద్ధప్ప ,రుద్ర గౌడ, ఎంపీపీ తనయుడు ఈసా, హమీద్, సుభాన్, అబ్దుల్ రెహ్మాన్, హెచ్ ఇర్ఫాన్, చికెన్ బక్షి, అతావుల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.