హిజాబ్ వ్యతిరేక నిరసనలు.. 75 మంది మృతి
1 min readపల్లెవెలుగువెబ్: ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు తెరపడడం లేదు. గత పది రోజులుగా వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 75 మంది మృతి చెందారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో మహస అమిని అనే 22 ఏళ్ల యువతిని నైతిక విలువల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో ఆ తర్వాత ఆమె మృతి చెందడం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు.