స్పందన విజ్ఞప్తులకు శాశ్వత పరిష్కారం చూపండి
1 min read– జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ”స్పందన” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజు, డ్వామా పిడి మద్దిలేటి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ….ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందన కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపి బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్ అయ్యేటట్లు చూడాలన్నారు.ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ సమస్యలుఅధికస్పందనజిల్లాస్పందన వెంటనేపదేపదేసమస్యలు పరిష్కారశనివారంఎల్ ఏలోకి వెళ్లకుండా గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో కొన్ని సమస్యలు:గుర్రంకొండ మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన ఎన్. రామకృష్ణారెడ్డి తనకు సదరం సర్టిఫికెట్ మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.వీరబల్లి మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన ఎస్.ప్రసాద్ తనకు రెండు కాళ్లు పనిచేయడం లేదని కృత్రిమ కాళ్లు మరియు మూడు చక్రాల బ్యాటరీ స్కూటర్ ఇప్పించాలని వినతి పత్రం సమర్పించారు.రాయచోటి మండలం, బోస్ నగర్ కు చెందిన పి.భాగ్యమ్మ తనకు ఇంటి స్థలం మంజూరు చేయించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.సంబేపల్లి మండలం, మోటకట్టు గ్రామానికి చెందిన సి.నరసింహారెడ్డి సర్వే నెంబర్ 470/4 లో 50 సెంట్లు తన భూమి ఆన్లైన్ చేయించాలని స్పందనలో అర్జీ సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.