ఆర్టీసీ బస్టాండ్ లలో మెరుగైన వసతులు కల్పించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లా పరిధిలోని 7 ఆర్టీసీ బస్టాండ్ లలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి డిపో మేనేజర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బస్టాండ్లలో వసతుల కల్పనపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఏడు బస్టాండ్ లలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. ప్రతిరోజూ దాదాపు 1, 20,000 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారని … బస్టాండ్ లలో అందుకు తగ్గ వసతులను ఏర్పాటు చేయాలని డిపిటిఓ , డిఐఎంఎస్ లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ బస్టాండ్ లో త్రాగు నీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్స్ సౌకర్యం తదితర స మెరుగైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్ద బస్టాండ్లలో వాటర్ బబుల్స్ అవసరానికి తగినట్లు అధిక ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బస్టాండ్ ఆవరణను పరిశుభ్రంగా వుంచాలని డిపో మేనేజర్లను సూచించారు. బస్టాండ్ లలో నిరుపయోగంగా ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి అందుకు తగ్గ మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా, డిపో అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.