ప్రజలకు మెరుగైన సేవలు అందించండి : సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
1 min read– జగనన్న గృహాల కోసం భూ సేకరణ,ల్యాండ్ కన్వర్షన్ భూమిని పరిశీలించిన సబ్ కలెక్టర్
పల్లెవెలుగు వెబ్, బండి ఆత్మకూరు: కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని పార్నపల్లి. లింగాపురం.గ్రామ సచివాలయం లను సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఎంత మంది జనాభా ఉన్నారు, అందులో మహిళలు పురుషులు ఎంతమంది వంటి వివరాలు సచివాలయాల పరిధిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి పెన్షన్ లు వస్తున్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్, స్పందన అర్జీల రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సచివాలయం బయట ప్రదర్శించాలన్నారు.
అనంతరం మండలం లోని నారాయణపురం గ్రామంలో 2 ఎకరాలు, లింగాపురం గ్రామంలో ఒక ఎకరా భూమిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహాల నిర్మాణం కొరకు గాను భూసేకరణ, పార్నపల్లి. పెద్ద దేవలా పురం గ్రామాలలోని ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించిన భూములను భూ రికార్డులను పరిశీలించారు. తదనంతరం మండలంలోని నారపురెడ్డి కుంట లో వున్న అంగన్వాడి సెంటర్ ను పరిశీలించారు. ఆ తరువాత చెంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బండి ఆత్మకూరు మండల తాసిల్దార్ హరిత, మండల అభివృద్ధి అధికారి వాసుదేవ గుప్తా, కార్యాలయం సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు,తదితరులు పాల్గొన్నారు.