PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి

1 min read

జిల్లా ఎన్నికల అధికారి,జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ గడివెముల:  పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అధికారులను అదేశించారు. శుక్రవారం. మండలపరిధిలో నిబూజునూరు, పెసరవాయి,కరిమద్దెల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించారు. ఓటర్ల నుంచి వచ్చిన క్లైమ్స్‌ను త్వరగా విచారించాలన్నారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎన్నికల సంఘం అదేశాల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లోని సదుపాయాలపై నివేదికలు అందజేయాలని. అధికారల నుకోరారు.కొత్తగా,చనిపోయిన వారి క్లైమ్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. బీఎల్‌ఓలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నందు ఓటును పరిశీలించుకోవాలన్నారు. పారదర్శకంగా ఓటరు జాబిత తయారు చేస్తున్నట్లు చెప్పారు. బూ జునూరు గ్రామంలో గ్రామంలో లేని వారికి ఓట్లు ఎక్కించారని జిల్లా ఎన్నికల అధికారికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యకు తెలిపారు. గతంలో దొంగ ఓట్ల కారణంగా మేము నష్టపోయామని తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకులు పంట రామచంద్రారెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ గ్రామంలో నివాసము ఉంటూ గుర్తింపు కార్డు ఉన్నవారికి గ్రామంలో ఓటు తప్పకుండా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పెసరవాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు వడ్డు  లక్ష్మీదేవి జిల్లా ఎన్నికల అధికారి నారపు రెడ్డి మౌర్యతో మాట్లాడుతూ. ఫ్యాక్షన్ గ్రామం కావడంతో మూడు పోలింగ్ కేంద్రాలు ఒకే చోట పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారికి కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ గ్రామం లో పాఠశాల భవనాల పనులు జరుగుతున్నడం వలన ఎన్నికల సమయం లోపల పాఠశాల భవనాల పనులు పూర్తయితే ఒకే చోట పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు,డీటీ గురునాథ్,ఏఈ పవన్,వీఆర్వో హరీంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author