NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీమా సౌకర్యం కల్పించండి

1 min read

పల్లెవెలుగు   వెబ్  చాగలమర్రి : ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పంపిణీ చేస్తున్న  ఎండీయు  ఆపరేటర్లకు, సహాయకులకు భీమా సౌకర్యాన్ని కల్పించాలని  ఎండియు ఆపరేటర్లు,  సహాయకులు  ప్రభుత్వాన్ని కోరారు. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ రేషన్‌ పంపిణీ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు, సహాయకులకు సహజ మరణం సంభవించిన , ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సహజ మరణానికి రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించాలన్నారు.అలాగే హెల్త్ కార్డులను కూడా  ప్రభుత్వం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.  అనంతరం తహసిల్దార్ విజయకుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.  గురువారం రేషన్ పంపిణీ చేస్తూ గుండెపోటుతో మరణించిన రంగస్వామికి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో ఎండియు ఆపరేటర్లు మహబూబ్ షరీఫ్, గోపాల్, పాములేటి, నాగ రమేష్, లక్ష్మయ్య, మహబూబ్ బాషా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author