PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తక్కువ ధరకు… వైద్యసేవలు అందించండి..

1 min read

ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

సిటీ మెడికల్​ సెంటర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరం మెడికల్​ హబ్​గా పేరుగాంచిందని.. పేదలకు తక్కువ ధరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. పాత నగరంలోని గడియారం ఆస్పత్రి పక్కన ఏర్పాటు చేసిన ‘సిటీ మెడికల్​ సెంటర్​.. సూపర్​ స్పెషాలిటీ క్లినిక్​’ను ఎమ్మెల్యేతోపాటు హార్ట్​ ఫౌండేషన్​ సూపర్​ స్పెషాలిటీ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​ యాదవ్​ ప్రారంభించారు.  ప్రముఖ న్యూరాలజిస్ట్​ డాక్టర్​. కె. హేమంత్​ కుమార్​, గైనకాలజిస్ట్​ డా. పి. స్నేహ, ఫిజిషియన్​ డా. సి. ఆర్​.తేజ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘సిటీ మెడికల్​ సెంటర్​ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిటీ మెడికల్​ సెంటర్​ సూపర్​ స్పెషాలిటీ క్లినిక్​ పేదలకు వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించాలని కోరారు. కర్నూలు పాత నగరంలో తక్కువ ధరకు వైద్యసేవలు అందించే ప్రైవేట్​ ఆస్పత్రులు లేవన్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​… సమీప ప్రాంతాల ప్రజలు సిటీ మెడికల్​ సెంటర్​ సూపర్​ స్పెషాలిటీ క్లినిక్​లో వైద్యచికిత్సలు పొందాలని కోరారు.  అనంతరం గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​ యాదవ్​ మాట్లాడుతూ సిటీ మెడికల్​ సెంటర్​లో ఆరోగ్య శ్రీ కింద  ఉచితంగా డెలివరి చేస్తారన్నారు. మెదడు మరియు నరాల సంబంధిత సమస్యలకు అత్యాధునిక  వైద్యసేవలు అందిస్తారన్నారు.  సిటీ మెడికల్​ సెంటర్​ను ఏర్పాటు చేసిన డా. పి. స్నేహ, డా. కె. హేమంత్​ కుమార్​ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

About Author