NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుప్పంలో నామినేష‌న్ వేసేందుకు భ‌ద్రత క‌ల్పించండి

1 min read

పల్లెవెలుగు వెబ్​ :కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసేందుకు భ‌ద్రత క‌ల్పించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌నర్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కుప్పం మున్సిపాలిటిలోని 14వ వార్డు అభ్యర్థిగా వెంక‌టేశ్ నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వెళ్లగా.. వైసీపీ నేత‌లు దాడి చేసి నామినేష‌న్ ప‌త్రాలు లాక్కున్నార‌ని తెలిపారు. నామినేష‌న్ కేంద్రం వద్దే దాడి జ‌రిగింద‌ని తెలిపారు. ఈ దాడిలో 30 మంది వ‌ర‌కు పాల్గొన్నార‌ని తెలిపారు. దాడి చేయ‌డ‌మే కాకుండా నామినేష‌న్ ప‌త్రాలు కూడ లాక్కున్నార‌ని తెలిపారు. దాడి చేసిన ఫోటోలు లేఖ‌తో పాటు జ‌త చేసి పంపారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు భ‌ద్రత క‌ల్పించాల‌ని, తెదేపా నేత‌లు స్వేచ్చగా నామినేష‌న్ వేసేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు.

About Author