పందిపాడు…ఇందిరమ్మ కాలనీ ప్రజలకు నీళ్లు అందించండి మహాప్రభో
1 min read
కర్నూలు మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం,కల్లూరు మండలంలో నీ శ్రీ గోడల వీరాంజనేయ స్వామి గుడి దగ్గర గత 15సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు.అయితే కాలనీ ఏర్పడి నుంచి కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు ఎంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వాలు ఎన్నో మారినకానీ కాలనీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు.వర్షాకాలం వచ్చిందంటే నడవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ బయటకు వెళ్లలేక పనులు చేసుకోలేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాలనీవాసులు పనిచేస్తే తప్ప ఇంట్లో పూట కూడా గడవదు.గత ప్రభుత్వంలో నీళ్ళకి ఆరు మోటర్లు తవ్వించగా, ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తున్నాయని దీంతో ప్రజలలు నీటి సమస్య ప్రధానంగా ఏర్పడిందని కాలనీ అభివృద్ధి కమిటీ బృందం రాము,అన్వర్ భాష,శేఖర్,నాగరాజు, మౌలాలి,కాలనీవాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాబోయేది ఎండాకాలం కనగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.కావున నగర పాలక సంస్థ కమిషనర్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.రిపేరిలో ఉన్న మోటార్లను మరమ్మత్తులు చేయాలనీ,అంతవరకు కనీసం మంచినీళ్ల ట్యాంకర్ లను సరఫరా చేయాలనీ వారు కోరారు.