PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెరుగైన వైద్య సదుపాయం అందించడం శుభ పరిణామం

1 min read

–యాజమాన్యానికి అభినందనలు
– జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కు అంగీకార పత్రాన్ని అందిస్తున్న గుడ్ సమ్మరిటన్
ఆసుపత్రి వర్గాలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు వంగాయిగూడెం లో ఉన్న గుడ్ సమర్టన్ క్యాన్సర్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ యాజమాన్యం ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి, కుటుంబ సభ్యులకు గుడ్ సమర్టన్ హాస్పిటల్ నందు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సదుపాయాలను కలగ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మనీ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల చాంబర్లో జిల్లా ఎస్పీని కలిసి అన్ని వైద్య సదుపాయాలు కలిగిన గుడ్ సమర్టన్ హాస్పిటల్ వంగాయగూడెం పి.అర్.ఒ. వినీల్ కలిసి యాజమాన్యం అంగీకార పత్రాన్ని జిల్లా ఎస్పీకి అందించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగానికి గుడ్ సమర్టన్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ ఫాదర్ వర్గీస్, సీఈఓ ఫాదర్ అజోలు తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయం అందించడం శుభపరిణామం అని జిల్లా ఎస్పీ గుడ్ సమర్టన్ యాజమాన్యానికి అభినందనలు తెలియ చేసినారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగేశ్వరావు పాల్గొన్నారు.

About Author