PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీజీహెచ్​లో పీఎస్​ఏ ఆక్సిజన్​ జనరేషన్‌ ప్లాంట్‌

1 min read

ప్రారంభించిన ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఎస్​. రాంసుందర్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ట్రయల్ రన్ ను సోమవారం ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో ప్రకృతి నుంచి ఆక్సిజన్‌ తయారు చేసే ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్పషన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ లో వన్ కిలో లీటర్…వెయ్యి లీటర్ల కెపాసిటీ… ప్రతి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ జనరేట్ చేస్తుందన్నారు. పి.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ చేశామని…మెయిన్ లైన్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది…బాగా ఫంక్షన్ లో ఉందన్నారు. ఇటువంటి ప్లాంటును సినీ నటుడు, సోనూసూద్​ కూడా ఇస్తామన్నారు. ఇటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే…. ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు.
ఆక్సిజన్​ కొరత రాకూడదనే…
కర్నూలు జిజిహెచ్ లో దాదాపు వెయ్యి మంది పేషెంట్స్ ఇప్పటికే ట్రీట్మెంట్ పొందుతున్నారని, రాయలసీమ, తెలంగాణ, బళ్లారి జిల్లాల నుంచి ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారని ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్ రెడ్డి తెలిపారు. కరోన బాధితులకు ఆక్సిజన్​ కొరత రాకూడదనే ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటు చేశామన్నారు. పీ.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ లో పాల్గొన్న జేసీ (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ చీఫ్ మెడికో డాక్టర్ ఇలియాస్, ఏఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author