సైకో ముఖ్యమంత్రి ధన దాహానికి సామాన్య ప్రజలు విలవిల..
1 min read– వై.నాగేశ్వరరావు యాదవ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు నంద్యాలలో స్థానిక యాదవ తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యమేవ జయతే రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగినది.ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ పాల్గొని సంఘీభావం తెలపడం జరిగినది.ఈ దీక్ష శిబిరంలో నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూసత్యమేవ జయతే… సత్యం ఎల్లప్పుడూ జయిస్తుంది. ఈ వైసీపీ ఎంత కుట్ర చేసి ఎన్ని అక్రమ కేసులు బనాయించిన, చివరికి సత్యమే గెలుస్తుంది. మచ్చలేని నాయకుడిగా మా మహా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తిరిగి బయటకు వస్తారు. ప్రపంచంలో ఆయన విజన్ వల్ల బాగుపడిన విద్యార్థులు,విద్యార్థి కుటుంబాలు,ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా పనిచేసి, విజన్ ఉన్న నాయకుడిగా ప్రపంచ దేశాల నలుమూలలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తెలుగు యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత, మహా నాయకుడు మన నారా చంద్రబాబునాయుడుకి దక్కుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రం మరొక బీహార్ ను తలపిస్తుంది. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగైపోయాయి. ఈ సైకో ముఖ్యమంత్రి ధన దాహానికి అనేక కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాయి. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.ప్రజాక్షేత్రం లో ప్రజలు వాల్ల ఓటు హక్కు తో మీకు,మీ వైసీపీ ప్రభుత్వనికి తగిన బుద్ధి చెబుతారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గం అధ్యక్షురాలు విజయ గౌరీ యాదవ్, విజయ శేఖర్,చలపతి, క్రాంతి కుమార్ యాదవ్ పృధ్వీరాజ్ యాదవ్ సురేష్ యాదవ్,రామకృష్ణ యాదవ్,వెంకటేశ్వర్లు యాదవ్, వెంకటరమణ,ఈశ్వరయ్య యాదవ్,ఉమామహేష్ యాదవ్, మద్దిలేటి స్వామి యాదవ్, శ్రీనివాసుల యాదవ్,తదితర యాదవ సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.