సైకో జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించడం దారుణం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ* కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సిఐడి అధికారులు అరెస్టు చేయడం దారుణమని టిడిపి నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా, టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ జబియుల్ల తెలిపారు.శనివారం ఆత్మకూరులోని కేజీ రోడ్డు మీదుగా నంద్యాల టర్నింగ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉండి సాక్షాలతో సహా దొరికిపోతే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా డ్రామాలు ఆడడం రాష్ట్ర ప్రజలందరూ చూశారని హత్య కేసులో నిందితుడినే అరెస్టు చేయలేని పోలీసులు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని అరెస్టు చేయడం దారుణం అన్నారు.చంద్రబాబు నాయుడు జీవితం తెల్ల కాగితం లాంటిదని ఆయన ఎప్పుడు కూడా మచ్చ లేకుండా పరిపాలన చేశారని తెలిపారు. కొండలు తవ్వి ఎలుకను పట్టినట్టు నాలుగున్నర సంవత్సరాలుగా 118 కోట్లు అవినీతి చేశానన్నడం సిగ్గుచేటు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మీద చేస్తున్న ఆరోపణలు నిజం కావని ఆ సంబంధిత అధికారులను మూడు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం వేదించి చంద్రబాబు పేరు చెప్పాలని వేధించి ఆయన పేరు చెప్పించారని తెలిపారు.హైకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మీకు క్లీన్ చేయట్ ఇచ్చిందని జగన్ ప్రభుత్వమే ఈ సంస్థ కార్యక్రమాలను పొగుడుతూ ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారని ఇప్పుడు దాని మీదనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి వస్తున్న మద్దతు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి జైలులో వేసి ఆ ప్రజాస్వాందనను ఆపాలని చూస్తున్నారని అది ఎవరి తరం కాదని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ నాయకులు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గౌస్ మాలిక్, మైనార్టీ నాయకులు కే జాకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు మనోహర్ ఆరో వార్డు టిడిపి ఇన్చార్జ్ ఇలియాస్, ఖలీలుల్లా ఖలీలుల్లా, కలీ ముల్ల,గనీ,గఫూర్,సలాం, శేక్షా,జకీర్ తదితరులు పాల్గొన్నారు.
సైకో జగన్ చంద్రబాబుని అరెస్టు చేయించడం దారుణం
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ* కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సిఐడి అధికారులు అరెస్టు చేయడం దారుణమని టిడిపి నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా, టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ జబియుల్ల తెలిపారు.శనివారం ఆత్మకూరులోని కేజీ రోడ్డు మీదుగా నంద్యాల టర్నింగ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉండి సాక్షాలతో సహా దొరికిపోతే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా డ్రామాలు ఆడడం రాష్ట్ర ప్రజలందరూ చూశారని హత్య కేసులో నిందితుడినే అరెస్టు చేయలేని పోలీసులు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని అరెస్టు చేయడం దారుణం అన్నారు.చంద్రబాబు నాయుడు జీవితం తెల్ల కాగితం లాంటిదని ఆయన ఎప్పుడు కూడా మచ్చ లేకుండా పరిపాలన చేశారని తెలిపారు. కొండలు తవ్వి ఎలుకను పట్టినట్టు నాలుగున్నర సంవత్సరాలుగా 118 కోట్లు అవినీతి చేశానన్నడం సిగ్గుచేటు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మీద చేస్తున్న ఆరోపణలు నిజం కావని ఆ సంబంధిత అధికారులను మూడు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం వేదించి చంద్రబాబు పేరు చెప్పాలని వేధించి ఆయన పేరు చెప్పించారని తెలిపారు.హైకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ మీకు క్లీన్ చేయట్ ఇచ్చిందని జగన్ ప్రభుత్వమే ఈ సంస్థ కార్యక్రమాలను పొగుడుతూ ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారని ఇప్పుడు దాని మీదనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి వస్తున్న మద్దతు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే జగన్ రెడ్డి జైలులో వేసి ఆ ప్రజాస్వాందనను ఆపాలని చూస్తున్నారని అది ఎవరి తరం కాదని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ నాయకులు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గౌస్ మాలిక్, మైనార్టీ నాయకులు కే జాకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు మనోహర్ ఆరో వార్డు టిడిపి ఇన్చార్జ్ ఇలియాస్, ఖలీలుల్లా ఖలీలుల్లా, కలీ ముల్ల,గనీ,గఫూర్,సలాం, శేక్షా,జకీర్ తదితరులు పాల్గొన్నారు.