సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెదేపా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని అంటూ తెదేపా ,జనసేన, బిజెపి ఉమ్మడి డోన్ నియోజకవర్గం సభ్యులు కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎంపీ సభ్యురాలు బైరెడ్డి శబరి లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం బీసీ జయహో కార్యక్రమాన్ని ప్యాపిలి మండల పరిధిలోని పోతుదొడ్డి గ్రామంలో తెదేపా నాయకులు పుల్లారెడ్డి ,కదిరప్ప, నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గం సభ్యులు కోట సూర్య ప్రకాష్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథులుగా హాజరై సభను ఉద్దేశించి వాళ్లు మాట్లాడుతూ వైసీపీ పాలనతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, ఇసుక మాఫీలు, భూకబ్జాలు, ఇష్టసారంగా సాగుతున్నాయి, అలాగే సాధారణమైన ప్రజలపై నిత్యవసరాల ధరలను పెంచి వారి నటీడిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే పోతుదొడ్డి గ్రామంలో నీటి సమస్య ఎద్దాడిందని గత పది సంవత్సరాల క్రితం సుజాతమ్మ పోతుదొడ్డి గ్రామంలో నీటి సమస్యకు బోరేపించి ప్రజలకు గ్రామంలో దాహం తీర్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకి దక్కిందని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నీటి కోసం బోరు వేశారు గాని మీరు మాత్రం పడలేదని మంచి మనసుతో వేస్తే నీరు పడతాయి కానీ వాటిలో కూడా కరెక్షన్ అని బోరు వేస్తే నీళ్లు పడతాయని వారు తెలిపారు. అలాగే ఎల్లప్పుడూ నా నియోజకవర్గ ప్రజలకు అవసరమొచ్చినా కోట్ల వారి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని, సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు వెన్నంటు ఉంటామని వారు పేర్కొన్నారు. కనుక ఈ అవకాశాన్ని మాపై ఆదరించి, సైకిల్ గుర్తుపై ఎంపీకి, ఎమ్మెల్యేకి రెండు ఓట్లు వేసి వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. గెలిచిన వెంటనే పోతుదొడ్డి గ్రామంలో ఏవైతే సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారు, వాటిని తీర్చుతానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, లక్క సాగరం లక్ష్మిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,ఆర్ ఇ .నాగరాజు, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణ మూర్తి ,మాజీ ఎంపీపీ టి శ్రీనివాసులు, రజిని రెడ్డి, గొల్ల రామ్మోహన్ యాదవ్, నడిగడ్డ నాగేంద్ర, గండికోట రామసుబ్బయ్య, మల్లికార్జున, కోదండ రామయ్య, సుదర్శన్, సందీప్, గండికోట పెద్ద రామాంజనేయులు, రాము మరియు బిజెపి జనసేన నాయకులు దామోదర్ నాయుడు, మహారాజ్, మద్దిలేటి ,చంద్ర, మధు మరియు పోరెడ్డి తెదేప నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.