రాష్ట్రంలో ప్రజా జనరంజక పాలన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చెన్నూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మంగళవారం వైయస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పెడబల్లె గణేష్ రెడ్డి లు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి, ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను వారి సమస్యలను తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి ఏ ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తే బాగుంటుందో భావించి అవన్నీ కూడా ప్రజలకు అందించి అపర భగీరధుడిగా పేరు తెచ్చుకున్నారని అయితే అలాంటి మహానేత పాలనను చూసి దేవుడు కూడా ఓర్చుకోలేక పోయారని వారు తెలిపారు, మళ్లీ ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసి నేటికి ఐదు సంవత్సరాలు అయిందన్నారు, అయితే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను, వారి సమస్యలను తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి వారి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావడం జరిగింది అన్నారు అంతేకాకుండా ప్రజలకు సరికొత్త ప్రజా జనరంజక పాలనను అందించడం జరుగుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ పి.ప్రతాపరెడ్డి, జే సి ఎస్ మండల కన్వీనర్ ఎరసాని నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పుల్లారెడ్డి, కొండారెడ్డి, సంపూర్ణ రెడ్డి, యువ నాయకులు గొర్లపుల్లయ్య గారి శివారెడ్డి, నిత్య పూజయ్య, రమేష్ రెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, వారిష్, అబ్దుల్ రబ్, అశ్రత్, హబీబ్, ఖాజా, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.