ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలి : డీఆర్ఓ పుల్లయ్య
1 min read- పల్లెవెలుగు వెబ్, కర్నూలు: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా అర్జీదారులు విన్నవించిన సమస్యలను వేగంగా, సత్వరమే పరిష్కరించాలని డిఆర్ ఓ పుల్లయ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని డిఆర్ఓ పుల్లయ్య నిర్వహించారు. డి ఆర్ ఓ పుల్లయ్య మాట్లాడుతూ…..డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 44 మంది ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలు విన్నవించారన్నారు. కరోన కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు.
డయల్ యువర్ కలెక్టర్ స్పందన కార్యక్రమంలో సమస్యలు :
1)కోసిగికి చెందిన సూర్యనారాయణ తమ గ్రామంలో బోగన్న చెరువు ఉందని, ఆ చెరువుకు ఆయకట్టు భూమి ఉందని, గ్రామపంచాయతీ అధికారులు చెత్త, చెదారం అంతా కూడా చెరువులో డంపింగ్ చేస్తున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
2) ఆత్మకూరు కరివేనకు చెందిన శేఖర్ తమ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ భీమా డబ్బులు ఇంకా జమ కాలేదని, డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలన్నారు.
3) మహానందికి చెందిన శ్రీనివాసులు నంద్యాల- మహానంది రోడ్డు సుగాలి మిట్ట – తమ్మడపల్లి వరకు రోడ్డంతా కూడా ఆక్రమణలు జరుగుతున్నాయని, రోడ్డు ఆక్రమణలు జరగకుండా చూడాలన్నారు.
4) మద్దికేర బసనే పల్లి గ్రామం చెందిన రాజు బసినేపల్లి నుంచి జొన్నగిరి వరకు రోడ్డు వేయాలని, తమ గ్రామం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారని, బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. తమ గ్రామంలో లింగాల చెరువు 750 ఎకరాల ఆయకట్టు ఉందని, ఆ చెరువుకు హంద్రీ నుంచి నీరు వచ్చేలా చూడాలన్నారు.
5) నందికొట్కూరు నాగటూరు గ్రామానికి చెందిన పద్మావతి వైయస్సార్ చేయూత పథకం వచ్చేలా చూడాలని ఆమె కోరారు.
6)ప్యాపిలికి చెందిన ఓ అర్జీదారుడు తన తమ్ముడు గత సంవత్సరంలో యాక్సిడెంట్ అయిందని, ఇంతవరకు వైయస్సార్ బీమా రాలేదని, వచ్చేల చూడాలన్నారు.
7) బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లి తండాకు చెందిన జగదీష్ నాయక్ ప్రభుత్వం గతంలో బోర్ వేసిందని, ప్రైవేట్ వ్యక్తులు మా స్థలంలో ఉందని అంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్ డీఏ పిడి వెంకటేశులు, హౌసింగ్ పిడి వెంకటనారాయణ, తదితరులు, పాల్గొన్నారు.