NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాబహిరంగసభ గోడపత్రికలు విడుదల

1 min read

నంద్యాల, న్యూస్ నేడు:  ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చిన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం ఇప్పటికీ కార్యాచరణ చేయకపోవడం వలన రాయలసీమ సమాజం తీవ్ర ఆవేదనలో వుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.సిద్దేశ్వరం అలుగు 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31 న సంగమేశ్వరంలో నిర్వహించే ప్రజాబహిరంగసభ విజయవంతంలో భాగంగా గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో గోడపత్రికలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేసారు.ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..2009 సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావంతో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర భారీ గొయ్యి ఏర్పడంతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. 2009 లో వచ్చిన వరదల తరువాత నేటి వరకు ఉన్న ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు భద్రత గురించి పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. ఏపీ అంటే అమరావతి.. పోలవరమే కాదని ఇది అందరిప్రదేశ్ గా గుర్తెరిగి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో మన సాగునీటి హక్కుల కోసం..రాయలసీమ సమగ్రాభివృద్ది కోసం  ఈ నెల 31 న సంగమేశ్వరంలో ప్రజా బహిరంగసభను నిర్వహిస్తున్నామని ప్రజలు స్వచ్చందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, న్యాయవాది అసదుల్లా,నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి,  పట్నం రాముడు, జానో జాగో కన్వీనర్ మహబూబ్ భాష, రాఘవేంద్రగౌడ్, నరశింహులు, మహమ్మద్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *