ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా వేదిక
1 min read
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా వేదిక కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కార వేదిక అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి ఇంచార్జ్ కార్యాలయంలో ప్రజా వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజావేదిక లో ప్రజల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని. ఆయన తెలిపారు. ప్రధానంగా రోడ్లు, తాగునీటి సమస్య, భూములకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వచ్చిన ధరఖాస్తులు సంబంధించిన ఆయ శాఖల అధికారులకు పంపించి వాటిని పరిష్కరించాలని సూచించారు. అలాగే వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలకు సంబంధించి అన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన ఏర్పాటు చేస్తామని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.