ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం
1 min read– ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మునిసిపల్ శాఖ అధికారులు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 1) ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో నివాసం ఉంటున్న మహేష్ తమ వీధి ఏరియాలో, రోడ్డుకు ఇరువైపులా కొత్త మురికి కాలువలు వెయ్యాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
2) F.C.I కాలనీలో నివాసముంటున్న ప్రవీణ్ కుమార్ తమ ఏరియాలో రోడ్లు నిర్మించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
3) టెలికాంనగర్లో నివాసముంటున్న యాకూబ్ తమ ఏరియా లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ కిందన మురికి నీరు నిల్వ ఉండటం వల్ల అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
4) బుధవారపేట లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తమ ఏరియా ప్రజల సౌకర్యాత్రము కొరకు అక్కడ ఉన్న మారెమ్మ కుంట మైదానంలో ఒక పాఠశాల, అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర మరియు మైదానం నిర్మించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
5) సోమిశెట్టి నగర్ లో నివాసం ఉంటున్న పాండురంగారావు తమ ఏరియాలో స్ట్రీట్ లైట్స్ లేవని అక్కడ కొత్త స్ట్రీట్ లైట్స్ కల్పించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
6) 12వ వార్డ్ కార్పొరేటర్ అయిన క్రాంతి కుమార్ తమ ఏరియాలో సిసి రోడ్లు వెయ్యాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
7) మహావీర్ నగర్ లో నివాసం ఉంటున్న కాలనీవాసులు తమ ఏరియాకు త్రాగునీటి పైప్లైన్ కల్పించాలని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
8) జానకి నగర్ లో నివాసం ఉంటున్న సీతారాం తమ ఏరియాలో కుక్కల మరియు కోతుల ఎక్కువగా ఉందని స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు.
స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి తక్షణ హామీ ఇచ్చిన కర్నూల్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర రావు , ఎస్ ఈ వేణుగోపాల్, డీసీపీ మోహన్ కుమార్ ,మేనేజర్ చిన్న రాముడు ఇతర అధికారులు.