ప్రజాసేవలో కాశీభట్ల సాయినాథ శర్మ
1 min readమోయిల్ల చెరువులో అంకాలమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఆలయాల నిర్మణానికి రూ. 2లక్షల అందజేత
కమలాపురం, పల్లెవెలుగు:పదవుల కోసం పాకులాడి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండడం మనం చూస్తున్నాం. కొందరు కోటీశ్వరులైతే పిల్లికి బిక్షం కూడా పెట్టరు. అవసరం ఉంటే తప్ప వారివైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది కమలాపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ పేదలను తనశక్తి మేరకు ఆదుకుంటున్నారు. అభాగ్యులకు నేనున్నాంటూ అండగా నిలుస్తున్నారు. ఇంటికి పెద్దదిక్కు లేక పోతే తాను దిక్కవుతున్నారు. నియోజక వర్గంలో అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్నారు. గుడి కోసం, మసీదు కోసం, చర్చి కోసం ఎవరు అడిగినా కాదనకుండా సహాయం చేస్తున్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని వీరపునాయుని పల్లె మండలం మొగిలి చెరువులో పలువురు అమ్మవారి ఆలయాలను నిర్మించు కోవాలని ఆర్థిక సహాయాన్ని సాయినాథ్ శర్మను కోరారు. ఆయన స్థానికంగా లేక పోయినా వెంటనే తన అనుచరుల ద్వారా రూ. 2లక్షలు అందించి తన ఉదారతను చాటుకున్నారు. మొగిలిచెరువులో అంకాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి ఆలయాల నిర్మణానికి తమ అనుచరులు దివాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భార్గవరెడ్డి, లక్ష్మిరెడ్డిలకు కాశీభట్ల సాయినాథశర్మ రూ. 2లక్షలు పంపించారు. వారు తమ నాయకుడి పేరిట, సిద్దేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలకు అందించారు. ఈ సందర్భంగా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకైనా కట్టుబడే వ్యక్తి సాయినాథ శర్మ అని గ్రామ పెద్దలు కొనియాడారు. ఆయన ఇటీవల కాలంలో నియోజక వర్గంలో ఆదుకుంటున్న విషయాన్ని అక్కడి ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.