NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాశ్రేయస్సే నా లక్ష్యం : బుడ్డా

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య శ్రేయస్సే తన లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గ మాజీ MLA టీడీపీ ఇంచార్జి బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా పట్టణంలోని MM ఫంక్షన్ హాల్ లో జరిగిన టీడీపీ పార్టీ RTS కార్యక్రమానికి హాజరయ్యారు, ఇదే ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శ్రీశైలం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి పస్పిల్ మున్నా బృందం ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఎప్పటికప్పుడు ఆరోగ్య సమసస్యలను నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్ లను సంప్రదించి సరైన చికిత్సలు తీసుకోవాలన్నారు, ఉచిత మెడికల్ క్యాంప్ లకు సహకరిస్తున్న శాంతిరామ్ హాస్పిటల్ యాజమాన్యం శాంతిరాముడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో MLC అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పస్పిల్ మున్నా,వెన్న శ్రీధర్ రెడ్డి, వేణు, మల్లేశ్వర్ రెడ్డి, రేణుకాప్రసాద్,రాజా రెడ్డి, అబ్దుల్ హుస్సేన్ పాల్గొన్నారు.

About Author