NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇది ప్రజల ప్రభుత్వం..! ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం..!

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజా సంక్షేమమే  ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు రవియాదవ్  పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొణిదెల 1వ సచివాలయం పరిధిలో  ఆంధ్రప్రదేశ్ కు  జగనే ఎందుకు కావాలంటే..పల్లె కు పోదాం కార్యక్రమం ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.అనంతరం  గ్రామ నాయకులతో కలిసి వైసీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవియాదవ్  మాట్లాడుతూ  అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండకూడదని సీఎం జగనన్న సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలను ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ కలిమున్నీసా, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ , జేసీఎస్ కన్వీనర్  ఓంకార్ రెడ్డి ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,డైరెక్టర్ గంగాధరప్ప, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి , వైస్ ఎంపీపీ పబ్బతి జ్యోతి రవి కుమార్ , ఎంపీటీసీ సురేష్,కొణిదెల  వైసీపీ నాయకులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, వంగల ప్రతాప్ రెడ్డి,లక్ష్మి రెడ్డి, కొంగర అయ్యన్న, వెంకట నాగశేషులు, కురువ మల్లయ్య, కొంగర రమణ, కొంగర రాజు,,కొనిదేలా గ్రామ వైస్సార్సీపీ నాయకులు,మండల కమిటీ సభ్యులు,గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు కార్యకర్తలు, 

పాల్గొన్నారు.

About Author