ప్రజా సంక్షేమమే ద్వేయంగా జగనన్న పాలన..
1 min read– ప్రజా సమస్యల పరిష్కరానికే గడపగడప కార్యక్రమం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంక్షేమ పథకాలుతోనే పేదల అభివృద్ధి జరుగుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పేర్కొన్నారు. నందికొట్కూరు పట్టణంలోని సచివాలయ 4 పరిధిలో బుధవారం గాంధీ నగర్, పగిడ్యాల బైపాస్ రోడ్డు, ఆత్మకూరు రోడ్డు కాలనీలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నారు . ప్రతి ఇంటి గడపకు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు.వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందన్నారు.సమస్యల పరిష్కారానికే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతోందన్నారు.ఎన్నికలలోనూ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశంలోనే ఆదర్శంగా సీఎం జగన్ నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , నందికొట్కూరు మునిసిపల్ వైస్ చైర్మన్ మొల్లా రబ్బానీ , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల ఉసేనయ్య , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , జిల్లా ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సంటిగారి దిలీప్ రాజ్ , మున్సిపల్ కమిషనర్ పి. కిషోర్ , మండల డిప్యూటీ తహశీల్దార్ పద్మవతి , వైసిపి నాయకులు విశ్రాంత పోలీస్ అధికారి పేరుమాళ్ళ జాన్ , తమ్మడపల్లె విక్టర్ , పగిడ్యాల చిట్టి రెడ్డి, ఆర్ట్ శ్రీను, బిజినవేముల మహేష్, ముజీబ్, రహంతుల్లా, నారాయణ, అయ్యన్న,భాస్కర్, యోసేపు, తలముడిపి అశోక్ రెడ్డి, పైపాలెం ఇనాయతుల్లా, ముడియాల సుబ్బారెడ్డి, కలబండి అంకన్న, కదిరి సుబ్బన్న, వలిభాష, గోల,ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.