PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షం కురవాలని కప్పలకు పూజలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని కరిముద్దెల గ్రామంలో వర్షం కురవాలని కోరుతూ గ్రామస్తులు గ్రామ పెద్దలు మంగళవారం కప్పకు పూజలు చేపట్టారు. కప్పను పట్టుకొని కర్రకు వేపాకుతో కలిపి కట్టి ఇంటింటికి తిరిగారు. ఇళ్ళ వద్దకు వెళ్లగా మహిళలు , చిన్నారులు చెంబుతో కప్పకు నీళ్లు పోసి కుంకుమ అంటించి పూజలు చేపట్టారు. వర్షం సమృద్ధిగా కురిసి పాడిపంటలు పండాలని రైతుల కష్టాలు నుంచి గట్టెక్కాలని శివుడికి జలాభిషేకం చేశారు అనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తులకు వనభోజనాలు ఏర్పాటు చేశారు.

 

About Author