NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పులకేశి రెడ్డి..నీ కేసులకు భయపడను: నారా లోకేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ : హింసించే పుల‌కేశి రెడ్డి గారు, నాపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడ‌తావో పెట్టుకో, నేను రెడీ అంటూ సవాల్ విసిరారు నారా లోకేష్ . తెలుగుదేశం కార్యక‌ర్త మారుతి పై హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన వైసీపీ వారిని ప్రశ్నించిన తనపై కేసు క‌ట్టిన వైసీపీ పోలీసులు, దాడుల‌కు పాల్పడుతోన్న వైసీపీ నేతలపై ఎందుకు కేసులు పెట్టరు? అని ప్రశ్నించారు. క‌రోనా క‌ట్టడిలో విఫ‌లమ‌య్యార‌ని ఆరోపించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారిపై త‌ప్పుడు కేసు పెట్టారని.. జగన్ అవినీతిని నిల‌దీసిన టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి గారిని అక్రమ అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ కార్యక‌ర్తల‌పై దాడులేంట‌ని ప్రశ్నించిన‌ తన పై ఫేక్ కేసు నమోదు చేశారని తెలిపారు. ‘నువ్వు అధికారంలోకొచ్చింది ప్రజ‌ల్ని ర‌క్షించేందుకా? ప్రతిప‌క్షంపై క‌క్ష తీర్చుకునేందుకా?అధికారం అండ‌గా అక్రమ‌కేసుల‌తో ప్రతిప‌క్షాన్ని బెదిరించి, భ‌య‌పెట్టాల‌నుకుంటున్నావు. తెలుగుదేశం అధ్యక్షుడి నుంచి అభిమాని వ‌ర‌కూ, కార్యక‌ర్త నుంచి కార్యద‌ర్శి వ‌ర‌కూ ఎవ్వరూ నీ కేసులకు భ‌య‌ప‌డ‌రు.’ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.

About Author