రోల్ మోడల్ గా పులివెందుల…
1 min read– నుతీసుకొని గుండ్ల సింగవరం గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
– ఫ్యాక్షన్ రాజకీయంలో గుండ్ల సింగవరం గ్రామస్తులు తమ వెంట ఉండి అందించిన సహాయ సహకారాలు మరువలేనివి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో.అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో 2 కోట్ల 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, అంగన్ వాడి సెంటర్ ఒకటి,రెండు వ సెంటర్ సెంటర్ రెండు ప్రహరీ గోడలు, కాలువలను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి , పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు, టిటిడి పాలక మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి , ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర పోతుల పాపి రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంనకు ఆవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి , వైయస్సార్ పార్టీ నాయకులు చల్లా సూర్యప్రకాశ్ రెడ్డి గారు, చల్లా భాస్కర్ రెడ్డి గారు, అవుకు మండల జడ్పిటిసి చల్లా శ్రీ లక్ష్మీ గారు,గుండ్ల సింగవరం గ్రామ సర్పంచ్ కాటసాని రమాకాంత్ రెడ్డి ,వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు కాటసాని ఓబుల్ రెడ్డి గారు, వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి కాటసాని ప్రసాద్ రెడ్డి ,అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.గ్రామానికి చేరుకున్న అతిధులకు గుండ్ల సింగవరం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ముఖ్య అతిధులు ప్రసంగించారు. ముందుగా 35 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, 21 లక్షల 80 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 17 లక్షల 50 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం ను, 24 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు అంగన్ వాడి సెంటర్ లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ ,ప్రహరీ గోడలు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను అనంతరం సభను ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి అతిధులు మాట్లాడారు.బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత జన్మనిచ్చిన గ్రామాన్ని మనం ఉన్నత స్థానంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మరువకూడదనే సిద్ధాంతం తోనే ఈరోజు గుండ్ల సింగవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అందుకే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల వద్దకే తీసుకువచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు, అనుగుణంగా పులివెందుల గ్రామాన్ని రోల్ మోడల్ గా తీసుకొని గుల్ల సింగవరం గ్రామాన్ని అభివృద్ధి గ్రామం గా అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. తమ కాటసాని కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఇప్పుడు గుండ్ల సింగవరం గ్రామం తో పాటు గడ్డ మేకుల పల్లె, నిచ్చెన మెట్ల అన్నవరం కోనాపురం గ్రామాలు తమకు కష్ట నష్ట సుఖాల్లో అండగా ఉండడం జరిగిందని 2004వ సంవత్సరం ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఇరువర్గాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఆనాడు నుంచి నేటి వరకు అండగా ఉన్న ఈ గ్రామ ప్రజల రుణం ఎన్నటికి కూడా తీర్చుకోలేమని చెప్పారు.పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గుండ్ల సింగవరం సర్పంచ్ మా అన్న కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి కోరిక మేరకు గుండ్ల సింగవరం గ్రామంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేయడానికి తాను, తన తమ్ముడు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బొతుల పాపి రెడ్డి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని చెప్పారు. గుండ్ల సింగవరం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఆజం ఖాన్, అవుకు మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రసాదు, మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ రావు, మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, అశ్వర్ధ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డి, కోవెలకుంట్ల పట్టణ ఉపసర్పంచ్ జిసిఆర్ సూర్యనారాయణ రెడ్డి, గుండ్ల సింగవరం ఎంపీటీసీ ఉమ్మడి పార్వతమ్మ, గుండ్ల సింగవరం గ్రామ ఉపసర్పంచ్ గడ్డం ఆదినారాయణ రెడ్డి, గుండ్ల సింగవరం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉమ్మడి పెద్ద మునిరెడ్డి ఉమ్మడి పుల్లారెడ్డి చిట్టి గడ్డం చిన్న అంకాల్ రెడ్డి, గడ్డం రామిరెడ్డి, కే. లక్ష్మీరామిరెడ్డి, నారప్ప గారి శివారెడ్డి, కసిరెడ్డి అయ్యప్ప రెడ్డి, నారెడ్డి శంకర్ రెడ్డి ,శెట్టి సుబ్రహ్మణ్యం లతోపాటు అవుకు మండలం వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు సచివాలయం సిబ్బంది, వాలంటరీలు, రైతు భరోసా సిబ్బంది, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు.